న్యూఢిల్లీ, మే 6: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం..తన యూజర్లకు మరో శుభవార్తను అందించింది. తన యాప్లో కొవిడ్-19 వ్యాక్సిన్ ఎక్కడ లభించే సమాచారాన్ని పొందుపరుచనున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాక్స్ స్లాట్స్, లభ్యత వివరాలు అందించడానికి ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’ అనే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సంబంధిత స్లాట్ అందుబాటులోకి వచ్చినప్పుడు తన వినియోగదారులకు అలర్ట్ చేయనున్నది.