శనివారం 06 జూన్ 2020
Cinema - May 12, 2020 , 10:16:16

బ‌న్నీ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్‌కి బిత్త‌రపోయిన నెటిజ‌న్స్..!

బ‌న్నీ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్‌కి బిత్త‌రపోయిన నెటిజ‌న్స్..!

అభిమానుల‌లో సృజ‌నాత్మ‌క‌త రోజురోజుకి పెరుగుతూ పోతుంది. త‌మ హీరోల‌ని హై రేంజ్‌లో ఇమాజినేష‌న్ చేసుకుంటూ అందుకు సంబంధించి వారు రూపొందిస్తున్న పోస్ట‌ర్స్  నెటిజ‌న్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. ఒక్కోసారి ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్స్ చూస్తుంటే చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా రిలీజ్ చేసిన పోస్ట‌రా అనే అనుమానం క‌లిగేలా ఉంటున్నాయి. తాజాగా బ‌న్నీ అభిమాని పుష్ప సినిమాకి సంబంధించి పోస్ట‌ర్ రూపొందించారు. ఇది చూసి ఫ్యాన్స్ అవాక్క‌వుతున్నారు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. చిత్తూరు శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల అరాచకాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో బ‌న్నీ లారీ డ్రైవర్‌గా క‌నిపిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో బ‌న్నీ ఎర్ర చందనం ప‌క్క‌న కూర్చొని ఉన్నాడు. ఆయ‌న వెనుక పోలీసులు ఉంటారు. ఇప్పుడు తాజాగా ఫ్యాన్ రూపొందించిన పోస్ట‌ర్‌లో బ‌న్నీని హైలైట్ చేస్తూ అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయాలా డిజైన్ చేశారు. ఇది ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. 


logo