బుధవారం 03 జూన్ 2020
Cinema - May 17, 2020 , 16:29:10

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో డేవిడ్ వార్న‌ర్ సినిమా..!

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో డేవిడ్ వార్న‌ర్ సినిమా..!

బంతుల‌ని సునాయాసంగా బౌండరీల‌కి త‌ర‌లించ‌డంలో దిట్ట అయిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ ఇటీవ‌ల వ‌రుస టిక్ టాక్ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని థ్రిల్‌కి గురి చేస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పోకిరి సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌కి కూడా వార్న‌ర్ టిక్ టాక్ వీడియో చేయ‌గా, దీనికి ఫిదా అయిన పూరీ.. త‌న సినిమాలో చిన్న క్యారెక్ట‌ర్ చేయాల‌ని కోరాడు. ఇందుకు వార్న‌ర్.. సన్ రైజ‌ర్స్‌ వాళ్లు విడిచిపెడితే తప్పకుండా నటిస్తా అన్నాడు. 

పూరీ, వార్న‌ర్ మ‌ధ్య జ‌రిగిన డిస్క‌ష‌న్ త‌ర్వాత నెటిజ‌న్స్ త‌మ క‌ళాపోష‌ణ‌ని చూపిస్తూ ప‌లు పోస్ట‌ర్స్ చూపించారు. వార్న‌ర్‌ని ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలోకి మార్చి డేవిడ్ భాయ్ పేరుతో ఒక పోస్టర్ రెడీ చేశారు. అందులో వార్నర్‌పై తుపాకులు ఎక్కు పెట్టి ఉండగా.. ఠీవిగా వార్నర్ నడిచి వస్తున్నట్లు చూపించారు. పూరీ సినిమాలు ఎక్కువ‌గా మాఫియా నేప‌థ్యంలో ఉంటాయి కాబ‌ట్టి నెటిజ‌న్స్ ఇలా రూపొందించి ఉంటార‌ని తెలుస్తుంది.  


logo