గురువారం 28 మే 2020
Cinema - May 10, 2020 , 14:31:25

పోకిరి డైలాగ్ చెప్పిన వార్న‌ర్.. స్పందించిన పూరీ

పోకిరి డైలాగ్ చెప్పిన వార్న‌ర్.. స్పందించిన పూరీ

క్రికెట్‌ గ్రౌండ్‌లో బంతులని అవ‌లీల‌గా బౌండ‌రీల‌కి త‌ర‌లించ‌డంలో దిట్ట డేవిడ్ వార్న‌ర్. లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌స్తుతం క్రికెట్‌కి దూరంగా ఉన్న వార్న‌ర్ టిక్ టాక్‌లో రెచ్చిపోతున్నారు. ప‌లు వీడియోల‌కి డ్యాన్స్‌లు చేయ‌డంతో పాటు డైలాగ్స్‌కి యాక్ష‌న్ కూడా చేస్తున్నారు. సౌత్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన క్ష‌త్రియ పుత్రుడు, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని సాంగ్స్‌కి స్టెప్పులేసిన వార్న‌ర్ తాజాగా పోకిరిలోని ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌కి యాక్ష‌న్ చేసి చూపించాడు.

పోకిరిలో  మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ “నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను”.  ఈ డైలాగ్‌ ను, వార్నర్ తన బ్యాట్‌ని చూపిస్తూ చెప్పి అందుకు సంబంధించిన‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. పైగా గెస్ ద మూవీ అని నెటిజన్లకు ఛాలెంజ్ కూడా చేశాడు.  అయితే వార్న‌ర్ వీడియోపై పోకిరి ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ స్పందించారు.

డేవిడ్ ఈ డైలాగ్ మీకు స‌రిగ్గా స‌రిపోతుంది. మీ దూకుడు, ప‌ట్టుద‌ల‌ని చూస్తుంటే ఇది ప‌క్కా సూట‌వుతుంద‌నిపిస్తుంది. క్రికెట‌ర్‌గానే కాదు న‌టుడిగాను అల‌రిస్తున్నారు. మీరు నా చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తార‌ని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు పూరీ logo