బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 29, 2020 , 08:46:05

ప్ర‌జ‌లు ఇళ్ళ‌ల్లోనే ఉండేందుకు పూరీ స‌ల‌హా..

ప్ర‌జ‌లు ఇళ్ళ‌ల్లోనే ఉండేందుకు పూరీ స‌ల‌హా..

కరోనా మ‌హ‌మ్మారి క‌ర‌తాళ నృత్యం చేస్తుంది. రోజు రోజుకి క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరుగుతూ పోతున్నాయి. క‌రోనాని క‌ట్టడి చేయాలంటే స్వీయ నియంత్ర‌ణ త‌ప్ప‌క పాటించాల‌ని వైద్యులు, ప్ర‌భుత్వం, ప్ర‌ముఖులు ఎంత‌గా చెప్పిన‌ప్ప‌టికీ, కొంద‌రిలో ఏ మాత్రం మార్పు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ వినూత్న స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌జ‌లని ఇళ్ళ‌ల్లో ఉంచేందుకు అత్యుత్త‌మ మార్గం ఉంది. అదే డ్రోన్‌. దాని వ‌ల‌న పూర్తిగా లాక్ డౌన్ అవుతుంది. ఆర్మీ, పోలీస్ ఆఫీస‌ర్స్ ఎవ‌రు అక్క‌ర్లేదు. త‌క్కువ ఖ‌ర్చు మ‌రింత ఉప‌యోగం అని పూరీ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి పేర్కొన్నారు. అయితే ఆ వీడియోలో డ్రోన్‌కి దెయ్యం మాదిరిగా బొమ్మ‌ని అమ‌ర్చి జ‌న‌స‌మూహాల‌లోకి పంపిస్తే దానిని చూసి అంద‌రు ప‌రుగెత్తుతండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.


logo