గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 19:23:22

విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌' ముచ్చట్లు

విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌'  ముచ్చట్లు

‘ఇస్మార్ట్‌ శంకర్‌' లాంటి ఊరమాస్‌ విజయం తర్వాత పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్‌' (వర్కింగ్‌ టైటిల్‌) విజయ్‌ దేవరకొండ-పూరి కలయికలో తెరకెక్కుతున్న తొలిచిత్రమిది. పాన్‌ఇండియా మూవీగా నాలుగు భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఎక్కువశాతం ముంబయ్‌లోనే ప్లాన్‌ చేశారు. విజయ్‌ బాక్సార్‌గా కనిపించనున్న ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటివరకు నలభైశాతం వరకు ముంబయ్‌లో షూట్‌ చేశారు. ఇక కరోనా మహామ్మరి ముంబయ్‌లో విజృంభిస్తున్న నేపథ్యంలో పూరి తన బ్యాలెన్స్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత ‘ఫైటర్‌' షూట్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు పూరీ. అనన్య పాండే ఈ చిత్రంలో నాయికగా నటిస్తోంది. 


logo