బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 18:19:17

వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్‌.. ప్ర‌భుత్వాల‌కు పూరి జ‌గ‌న్నాథ్‌ విజ్ఞ‌ప్తి

వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్‌.. ప్ర‌భుత్వాల‌కు పూరి జ‌గ‌న్నాథ్‌ విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్ : వ్య‌వ‌సాయం రైతులే చేయాలా? ఏం ప్ర‌భుత్వం చేయ‌కూడ‌దా? ప‌్ర‌భుత్వం వ్య‌వ‌సాయ‌రంగంలోకి ప్ర‌వేశించాలని అందుకు ఇదే అనువైన స‌మ‌యం అని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ అన్నారు. నాయ‌కులంతా త‌ల‌పాగాలు చుట్టి రైత‌న్న‌లా మారాల‌న్నారు. గ‌త కొన్ని వేల సంవ‌త్స‌రాలుగా కొత్త కొత్త ప‌ద్ధ‌తులెన్నో క‌నిపెట్టి అవ‌లంభించిన మ‌నం ప్ర‌స్తుత త‌రుణంలో వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్‌పై అడుగులు వేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. లేక‌పోతే భ‌విష్య‌త్ త‌రాలు, మ‌న పిల్ల‌ల‌కు తిండి కూడా దొర‌క‌ద‌న్నారు. పూరి జ‌గ‌న్నాథ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్ గురించి వివ‌రించారు.  

నిమిషానికి 250 మంది శిశువులు జ‌న్మిస్తున్నారు. ప్ర‌తిరోజు నాలుగు ల‌క్ష‌ల మంది పిల్ల‌లు పుడుతున్నారు. సంవ‌త్స‌రానికి 140 మిలియ‌న్లు‌. ఈ లెక్క‌న రెండు ద‌శాబ్దాల్లో 10 బిలియ‌న్ జ‌నాభా పెరిగిపోతుంది. ఇంత‌మందికి ఆహారం ఎక్క‌డినుంచి వస్తుంది. ఒక ప‌క్క రైతు చ‌చ్చిపోతుంటే వ్య‌వ‌సాయం ఎలా పెరుగుతుంది. అందుకే మన‌మే రైతులా మారిపోవాలి. మ‌న కిచెన్ ప‌క్క‌నే కూర‌గాయ‌లు పెర‌గాలి. ప్ర‌తీ ఇంట్లో రైతు పుట్టాల్సిన స‌మ‌యం ద‌గ్గ‌ర‌బ‌డింది. ఇంటింటా వ్య‌వ‌సాయం రావాలి. ఎవ‌రి కూర‌గాయ‌లు వారే పండించుకోవాలి. అయితే ప్ర‌భుత్వ‌మే వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్ గురించి అవ‌గాహ‌న తీసుకురావాలన్నారు. ప్ర‌తీ గ్రామంలో వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్‌మొద‌లుపెట్టాలన్నారు. 

ఇప్పుడు రైతులు పండించేవి మ‌న‌కు భ‌విష్య‌త్తులో స‌రిపోవ‌న్నారు. ప్ర‌తీ ఊరిలో ప్ర‌భుత్వ‌మే పెద్ద పెద్ద షెడ్లు వేసి అందులో ఈ వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్ చేయాల‌న్నారు. ఏ ఊరికి కావాల్సిన‌వి ఆ ఊరిలోనే పండేలా చేయాలన్నారు. అది ఇప్ప‌టి నుండి మొద‌లుపెడితేనే పాతికేళ్ల త‌ర్వాత మ‌న అవ‌స‌రాలు తీరుతాయని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల చాలా మంది రైతుల‌కు ఉపాధి కూడ దొరుకుందన్నారు. ప్ర‌భుత్వం దీన్ని గ‌మ‌నించి సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కోరుతున్నాని పేర్కొంటూ ప్ర‌ధాని మోదీ, ప్ర‌ధాన‌మంత్రి కార్యాలయం, తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్‌, తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌, ఏపీ సీఎం, ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి క‌న్న‌బాబును ట్యాగ్ చేశారు.  


logo