ఆటో జానీ గుర్తుందా ! మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా రీ ఎంట్రీ కోసం పూరీ సిద్ధం చేసిన కథ ఇది. కానీ పూరీ రెడీ చేసిన స్క్రిప్ట్ చిరుకి నచ్చకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. దానికి బదులు ఖైదీ నంబర్ 150 చిత్రంతో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆటో జానీ సినిమాను ఎలాగైనా తీయాలని పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే అది మెగాస్టార్‌తో కాదు.. మాస్ మహారాజా రవితేజతో ! క్రాక్ సినిమా హిట్‌తో దూసుకెళ్తున్న రవితేజతో ఆటో జానీని తెరకెక్కించేందుకు పూరీ సిద్ధమైనట్లు ఇప్పుడు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
దాదాపు నాలుగేళ్ల కింద చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సమయంలో ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు చిరంజీవికి కథలు వినిపించారు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా మెగాస్టార్‌కు నచ్చలేదు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ చెప్పిన ఒక లైన్ చిరంజీవికి బాగా నచ్చింది. దాంతో బాగా ఎగ్జైట్ అయిపోయి వెంటనే ఈ సినిమా చేస్తున్నట్లు మీడియా ముందుకు వచ్చి అనౌన్స్ చేశాడు నిర్మాత రామ్ చరణ్. ఆ సినిమాకు ఆటో జానీ అని టైటిల్ అనుకున్నారు. రౌడీ అల్లుడు సినిమాలోని ఆటో జానీ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని.. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ను సిద్ధం చేశాడు పూరీ. కానీ పూరి చెప్పిన స్క్రిప్ట్ లో చిరంజీవి కొన్ని మార్పులు సూచించడం.. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ లో అసంతృప్తిగా ఉండటంతో ఈ సినిమా ఆగిపోయింది. అప్పట్లో ఈ విషయంపై పూరీ బాగా హర్ట్ అయ్యాడు. కథ నచ్చకపోతే తనకు చెప్పి ఉంటే బాగుండేది కాని మీడియా ముందుకు వచ్చి చెప్పడం బాగోలేదు అని చిరంజీవికి చురకలు అంటించాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడు అదే కథను రవితేజ హీరోగా చేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన పూరీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా తర్వాత రవితేజతో ఆటో జానీ తెరకెక్కించాలని పూరీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలు చేశాడు పూరీ జగన్నాథ్. ఒకవేళ ఇప్పుడు ఆటో జానీ రవితేజతో చేస్తే వీరి కాంబినేషన్లో ఆరో సినిమా అవుతుంది. మరి చిరంజీవి కోసం రాసుకున్న కథలో రవితేజ ఎంత వరకు సెట్ అవుతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ ఓటీటీ విడుదలకు ఓవర్సీస్ చిక్కులు
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
ఇర్ఫాన్ ఖాన్ భార్య ఎమోషనల్ పోస్ట్
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్