గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 12:08:39

బ‌న్నీ ట్వీట్‌తో అమితానందంలో పూరీ జ‌గ‌న్నాథ్ ..!

బ‌న్నీ ట్వీట్‌తో అమితానందంలో  పూరీ జ‌గ‌న్నాథ్ ..!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌కి ఇస్మార్ట్ శంక‌ర్ ఇచ్చిన హిట్ ఇప్ప‌టికీ గాల్లో తేలియాడేలా చేస్తుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న పూరీ .. క‌రోనా వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చాడు. ఇంట్లో ఉంటూ  పోడ్ కాస్ట్ ద్వారా అనేక విష‌యాల‌పై చ‌ర్చిస్తున్నాడు. ఇవి అంద‌రిని ఆలోజింప‌జేసేవిగా ఉంటున్నాయి.

పూరీ పోడ్ కాస్ట్ .. బ‌న్నీని కూడా ఇంప్రెస్ చేశాయి. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్‌లో పూరీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు స్టైలిష్ స్టార్. పోడ్ కాస్ట్ ద్వారా మీరు చెబుతున్న టాపిక్స్ చాలా గొప్ప‌గా ఉంటున్నాయి. ప‌ర్స‌న‌ల్‌గా అవి నాకు చాలా బాగా న‌చ్చాయి. ఇలాంటి పోడ్‌కాస్ట్‌లు మీ ద‌గ్గ‌ర నుండి మ‌రెన్నో ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు బ‌న్నీ.

అల్లు అర్జున్ ప్ర‌శంస‌ల‌కి పొంగిపోయిన పూరీ జ‌గ‌న్నాథ్‌.. నీ ట్వీట్‌ నాకు ఎంతో సంతోషాన్ని క‌లిగించింది. మంచి విజ‌యాలు సాధిస్తున్న మీ లాంటి యువ హీరోల నుండి ప్ర‌శంస‌లు అందుకోవ‌డం ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఈ ఆనందంలో మ‌రో పెగ్ ఎక్స్‌ట్రా వేస్తాను.. చీర్స్ అంటూ పూరీ స‌మాధాన‌మిచ్చాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో దేశ ముదురు, ఇద్ద‌రు అమ్మాయిల‌తో అనే సినిమాలు రూపొందిన విష‌యం తెలిసిందే.


logo