శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 20:17:49

యువ‌ర‌త్న 'ప‌వ‌ర్ ఆఫ్ యూత్ ' సాంగ్ ప్రోమో

యువ‌ర‌త్న 'ప‌వ‌ర్ ఆఫ్ యూత్ ' సాంగ్ ప్రోమో

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ న‌టిస్తోన్న చిత్రం యువ‌ర‌త్న. సంతోష్ ఆనంద్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ప‌వర్ ఆఫ్ యూత్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఊపిరాగినా బ‌తికే కిటుకు నేర్పిచూడు నీ ఆలోచ‌న‌కు..అంటూ సాగే పాట‌లో పునీత్ రాజ్ కుమార్ వ‌యోలిన్ చేతిలో ప‌ట్టుకుని స్టైలిష్ డ్యాన్స్ ఆక‌ట్టుకుంటోంది. రామ‌జోగ‌య్య‌శాస్త్రి ఈ పాట‌ను రాయ‌గా..న‌కాస్ అజీజ్ పాడాడు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ఈ చిత్రంలో స‌యేషా సెహెగ‌ల్ హీరోయిన్. ప్ర‌కాశ్ రాజ్‌, సోనూ గౌడ‌, దిగంత్ మంచ‌లే, ధ‌నంజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫుల్ లిరిక‌ల్ వీడియో సాంగ్ డిసెంబ‌ర్ 2న మ‌ధ్యాహ్నం 2.12 గంట‌ల‌కు అందుబాటులోకి రానుంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.