శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 15:43:06

కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసిన పునర్న‌వి

కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసిన పునర్న‌వి

పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో నటించిన పునర్నవి బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. ముఖ్యంగా ఈ షో రాహుల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ అంద‌రి నోళ్ళ‌ల్లో నానింది. బిగ్ బాస్ హౌజ్‌లో వీరి ప్ర‌వ‌ర్త‌న చూస్తే బ‌‌య‌ట‌కు వ‌చ్చాక త‌ప్పక పెళ్ళి చేసుకుంటారేమో అనే అనుమానం అంద‌రిలో క‌లిగింది.

ప‌లు ఇంట‌ర్వ్యూల‌కు కూడా రాహుల్,పునర్న‌వి ఇద్ద‌రు క‌లిసి హాజరు కాగా, ఆ స‌మ‌యంలో వీరిని.. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది ప్రేమ‌, స్నేహమా అని ప్ర‌శ్నించారు. దానికి స్నేహ‌మే అని స‌మాధానం ఇచ్చారు. క‌ట్ చేస్తే బుధ‌వారం రోజు త‌న‌కు ఎంగేజ్‌మెంట్ అయిందని చేతికి ఉన్న  రింగ్ ఫోటో షేర్ చేస్తూ అంద‌రికి షాక్ ఇచ్చింది పున‌ర్నవి . దీంతో ఈ అందాల బొమ్మ  పెళ్ళి చేసుకునే వ్య‌క్తి ఎవ‌రు అని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు నెటిజన్స్.

కొద్ది సేప‌టి క్రితం త‌న‌కు కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసింది ఈ ముద్దుగుమ్మ. అత‌ని పేరు ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ కాగా, అత‌ను యాక్ట‌ర్, రైట‌ర్, ఫిలిం మేక‌ర్ కూడా. రేపే పున‌ర్న‌వి, ఉద్భ‌వ్‌ల పెళ్ళి జ‌ర‌గ‌నుంది.