గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 11, 2020 , 20:26:39

పునర్నవి బ్రేక్‌కు కారణమిదే..

పునర్నవి బ్రేక్‌కు కారణమిదే..

ఉయ్యాల జంపాల సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. ఈ మూవీ తర్వాత పిట్టగోడ, ఎందుకో ఏమో, ఈ సినిమా సూపర్‌హిట్టు వంటి చిత్రాల్లో నటించింది. గతేడాది బిగ్‌బాస్‌ సీజన్‌ 3తో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. బిగ్‌బాస్‌ షో తో సోషల్‌మీడియాలో పునర్నవి ఫాలోవర్ల జాబితా అమాంతం పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు చక్కర్లు కొట్టినా..పునర్నవి మాత్రం వాటిని కొట్టిపారేసింది. తాము ప్రేమికులం అనేది వాస్తవం కాదని, రాహుల్‌, తాను మంచి స్నేహితులం మాత్రమేనని చాలా సార్లు వివరణ ఇచ్చింది. రాహుల్‌, పునర్నవి బిగ్‌బాస్‌ షోలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. 

అయితే కొన్నాళ్లుగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు విరామం ఇచ్చింది. ఇన్‌స్టా ఖాతాలో పునర్నవి అప్‌డేట్స్‌ ఏం లేకపోవడంతో..అభిమానులు ఆమె ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పక్కకు జరిగిందో తెలియక తికమక పడ్డారు. అయితే ఎన్నో రోజులుగా ఉన్న ఈ సస్పెన్స్‌కు తెరపడింది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే సోషల్‌మీడియాకు దూరంగా ఉందట పునర్నవి. నేను తిరిగి వచ్చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను బ్రేక్‌ తీసుకున్నా..ఎవరైనా గమనించారో..?? లేదో నాకు తెలియదు. అని కామెంట్‌ పెట్టింది. రీల్‌లైఫ్‌లో పడి నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. బ్రేక్‌ తీసుకోవడం వెనుక వేరే కారణమేమి లేదని చెప్పింది.  చిరునవ్వు చిందిస్తోన్న ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లో పోస్ట్ చేసింది. నేను తిరిగి యదాస్థితికి రావడానికి నాకిష్టమైన పుస్తకాలు చదివాను. మళ్లీ నా పనిని ప్రారంభించానని చెప్పింది. logo