శనివారం 29 ఫిబ్రవరి 2020
పునాదిరాళ్లు చిత్ర దర్శకుడు మృతి..

పునాదిరాళ్లు చిత్ర దర్శకుడు మృతి..

Feb 15, 2020 , 12:16:57
PRINT
పునాదిరాళ్లు చిత్ర దర్శకుడు మృతి..

హైదరాబాద్‌: పునాదిరాళ్లు చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన గుడిపాటి రాజ్‌కుమార్‌ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం. ఆయన మృతదేహాన్ని ఉయ్యూరు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు కావడం విశేషం. 1979 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకుంది. 


logo