శనివారం 30 మే 2020
Cinema - Mar 28, 2020 , 09:23:14

బాలీవుడ్ హీరోతో తీన్‌మార్ హీరోయిన్ వివాహం

బాలీవుడ్ హీరోతో తీన్‌మార్ హీరోయిన్ వివాహం

బాలీవుడ్ బ్యూటీ కృతి క‌ర్భందా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌ర‌చితం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన తీన్‌మార్‌లో క‌థానాయిక‌గా న‌టించిన ఈ అమ్మ‌డు మంచు మ‌నోజ్ స‌ర‌స‌న మిస్ట‌ర్ నూక‌య్య అనే చిత్రంతో పాటు ప‌లు సౌత్ సినిమాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల పాగ‌ల్‌పంథీ, హౌజ్‌ఫుల్ 4 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

కృతి కొన్నాళ్ళుగా త‌న పెళ్లి వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ న‌టుడు పుల్కిత్ సామ్రాట్‌తో ప్రేమ‌లో ఉన్న ఈ అమ్మ‌డు అత‌నితో ఏడ‌డుగులు ఎప్పుడు వేస్తుందా అని బీటౌన్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొంద‌రు ఈ సంవ‌త్స‌రంలో వారిద్ద‌రు ఒక్క‌టి కానున్న‌ట్టు జోస్యం చెబుతున్నారు. దీనిపై తాజాగా స్పందించిన కృతి.. మేమిద్ద‌రం ఇప్పుడు  వివాహం చేసుకోవ‌డానికి సిద్ధంగా లేము.  వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డానికి కొన్నేళ్లు ప‌డుతుంది. ప్ర‌స్తుతం అత‌ను చాలా చిన్న‌వాడు. వివాహ ప్ర‌ణాళిక‌ల‌పై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం అని కృతి క‌ర్భందా చెబుతుంది. కృతి, పుల్కిత్ ఇద్ద‌రు క‌లిసి పాగ‌ల్ పంథీ చిత్రంలో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే.


logo