శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 00:48:04

సైకో వర్మ వీడుతేడా

సైకో వర్మ వీడుతేడా

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైకోవర్మ’. ‘వీడు తేడా’ ఉపశీర్షిక. నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్నారు.  నట్టికుమార్‌ దర్శకుడు.  అనురాగ్‌ కంచర్ల, కరుణ నిర్మాతలు.  శనివారం నట్టి క్రాంతి జన్మదిన వేడుకలు జరిగాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. కరోనా ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌ చేస్తున్నాం. వయోలెన్స్‌, రొమాన్స్‌ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో పాటను విడుదల చేస్తాం’ అని తెలిపారు. హీరోగా క్రాంతికి మంచి పేరుతీసుకొచ్చే సినిమా ఇదని నిర్మాతలు చెప్పారు.


logo