మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 12:36:47

ప‌వ‌న్ 27వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది

ప‌వ‌న్ 27వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది

అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత రాజ‌కీయాల‌లోకి వెళ్లిన ప‌వ‌న్ రెండేళ్ళ త‌ర్వాత తిరిగి సినిమాల‌లో న‌టిస్తున్నారు. వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో త్వ‌ర‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న ప‌వ‌ర్ స్టార్ త‌న 27వ సినిమాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మ‌ధ్య  ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్  హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్, మొదటి రోజు షూట్‌కు పవన్‌ కూడా హాజరయ్యాడు. 

క‌రోనా వ‌ల‌న ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా, మ‌రి కొద్ది రోజుల‌లో తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్రీ లుక్ విడుద‌ల చేశారు ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఈ సినిమా కోసం  పదిహేను రోజుల‌ షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు  అందుకుంటుండాలని ఆశిస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు

ప‌వ‌న్ 27వ  సినిమాకు సంబంధించి విడుద‌లైన ప్రీ లుక్‌లో ప‌వ‌న్ చేతికి క‌డియం, న‌డుముకి ఎర్ర‌ని కండువా చూస్తుంటే ఈ చిత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి స‌రికొత్త ఉత్సాహాన్ని నింపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌  ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. మరో ముఖ్యపాత్రలో అనసూయ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు. 

స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు జరిగిన కొన్ని సన్నివేశాలకు ఫిక్షన్ జోడించి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని సినిమా రూపొందిస్తున్న‌ట్టు కొంత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇందులో ప‌వ‌న్ లుక్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.logo