బుధవారం 27 మే 2020
Cinema - May 22, 2020 , 21:20:08

విదేశాల్లో ఇరుక్కుపోయిన హీరో వచ్చేసాడు...

విదేశాల్లో ఇరుక్కుపోయిన హీరో వచ్చేసాడు...

సాదారణంగా పెద్ద హీరోల చిత్రాలు ఎక్కువగా విదేశాల్లో తీస్తుంటారు. దేశంలో అభిమానుల తాకిడి ఉండడం, మంచి మంచి లొకేషన్ల కోసం ఇతర దేశాల్లో చిత్రాలు షూటింగ్‌ చేస్తుంటారు మన దర్శకులు. అయితే మలయాళంలో మంచి స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్‌ కూడా ఇలాగే తన చిత్రం కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయాడు. దాదాపు మూడు నెలల క్రితం మలయాళ చిత్రం ఆడుజీవితం చిత్ర షూటింగ్‌ కోసం దాదాపు 60 మంది సభ్యుల చిత్ర బృందం జోర్ధాన్‌ దేశానికి వెళ్ళింది. అక్కడ చిత్ర షూటింగ్‌ సన్నివేశాలు జరుగుతున్న సమయంలోనే భారతదేశంతో పాటు అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో చిత్ర యూనిట్‌ అంతా అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో అక్కడ ఇరుక్కుపోయిన హీరో పృథ్వీరాజ్‌ చాలా రోజుల తరువాత వందే భారత్‌ మిషన్‌లో భాగంగా స్వదేశానికి రావడంతో అతని కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.


logo