ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 16:02:30

ముర‌ళీశ‌ర్మ డేట్స్ కోసం నిర్మాత‌ల టెన్ష‌న్..!

ముర‌ళీశ‌ర్మ డేట్స్ కోసం నిర్మాత‌ల టెన్ష‌న్..!

మ‌హేశ్ బాబు న‌టించిన అతిథి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు న‌టుడు ముర‌ళీశర్మ‌. ఈ చిత్రంలో ముర‌ళీశర్మ కైజ‌ర్ పాత్ర‌లో అద్బుత న‌ట‌న‌కు ఉత్త‌మ విల‌న్ గా నంది అవార్డు అందుకున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో క‌థా బ‌ల‌మున్న పాత్ర‌లు చేస్తూ ఎంతో మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న ఈ సీనియ‌ర్ యాక్ట‌ర్ లాక్ డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అందుబాటులో లేరు. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ ఎత్తివేసి ప‌రిస్థితులు కొంత సాధార‌ణ స్థితికి వ‌చ్చిన నేప‌థ్యంలో అంద‌రూ తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. 

అయితే ముర‌ళీ శ‌ర్మ డేట్స్ సంపాదించే విష‌యంలో నిర్మాత‌లకు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా పాత్ర‌లోనైనా ఒదిగిపోయే స్వ‌భావం గ‌ల న‌టుడు కావ‌డంతో ముర‌ళీశ‌ర్మ డేట్స్ ను సంపాదించడంలో టాలీవుడ్ నిర్మాత‌లు త‌ల‌మున‌క‌ల‌వున్నార‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.  ఇప్ప‌టివ‌ర‌కు రోజుకు రూ.2 ల‌క్ష‌లు తీసుకున్న ముర‌ళీశ‌ర్మను ఎలాగైనా త‌మ బ్యాన‌ర్ లో తీసుకోవాల‌ని చాలా మంది నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.పెద్ద మొత్తంలోనైనా రెమ్యునేష‌న్ ఇచ్చి త‌మ సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ముర‌ళీశ‌ర్మ ఏ నిర్మాత‌కు డేట్స్ ఇస్తారో..? చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo