శనివారం 30 మే 2020
Cinema - Apr 27, 2020 , 08:42:42

సూర్య‌కి స‌పోర్ట్‌.. ఓటీటీలో విడుదల చేయోచ్చంటున్న నిర్మాత‌లు

సూర్య‌కి స‌పోర్ట్‌.. ఓటీటీలో విడుదల చేయోచ్చంటున్న నిర్మాత‌లు

లాక్ డౌన్ వ‌ల‌న కొన్నాళ్ళ పాటు థియేట‌ర్స్ తెర‌చుకోక‌పోనుండ‌డంతో హీరో సూర్య  జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన  చిత్రం ‘పొన్మగల్ వంధాల్’ చిత్రాన్ని నేరుగా అమేజాన్ ప్రైమ్‌ లోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. ఇప్ప‌టికే అమేజాన్ ప్రైమ్‌తో సూర్య ఒప్పందం చేసుకున్నాడ‌న్న విష‌యం తెలుసుకున్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు దీనిని ఖండించారు. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాల‌ని డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే  థియేటర్స్ మనుగడకు ముప్పు వస్తుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. సూర్య త‌మ నిర్ణ‌యం మార్చుకోక‌పోతే  సూర్య ఫ్యామిలీ సినిమాల‌న్నీ బ్యాన్ చేస్తామ‌ని వారు అన్నారు.

అయితే ఈ విష‌యంలో సూర్య‌కి నిర్మాత‌ల సంఘం స‌పోర్ట్‌గా ఉంది. త్వరలో జరగనున్న నిర్మాతల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్న అమ్మ క్రియేషన్స్‌ టి.శివ మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల‌న ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సినీ ప‌రిశ్ర‌మ‌కి అమేజాన్ ప్రైమ్ లాంటి సంస్థ‌లు అండ‌గా ఉండ‌డం హ‌ర్ష‌నీయం. ఇలాంటి స‌మ‌యంలో చిన్న చిత్రాల నిర్మాత‌లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ క్ర‌మంలోనే పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. దీనిని  థియేటర్ల సంఘం వ్యతిరేకించడం సరికాదు. పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రంతో పాటు మరో ఐదు చిత్రాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారని అన్నారు.


logo