గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 17:13:04

ప్రభాస్ సంచలన నిర్ణయం..డైలమాలో నిర్మాతలు..!

ప్రభాస్ సంచలన నిర్ణయం..డైలమాలో నిర్మాతలు..!

ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ హీరో. అందుకే ఈయనేం చేసినా కూడా అందరి కళ్లు దానిపైనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఈయన ఓ నిర్ణయం తీసుకుంటున్నాడు. దాంతో నిర్మాతలతో పాటు దర్శకులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఆ నిర్ణయం ఇప్పుడు కాదు మరో రెండేళ్ళ తర్వాత అప్లై చేయబోతున్నాడు. అన్ని భాషల్లోనూ ప్రభాస్‌కు ఇప్పుడు మార్కెట్ ఉంది. బాహుబలి సినిమాతో వచ్చిన ఇమేజ్ ఫ్లూక్ కాదు..తర్వాత సినిమాలకు కూడా ఆ మార్కెట్ ఉందని నిరూపించుకునే పనిలోనే ఇప్పుడు బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఆ క్రమంలోనే బాహుబలి తర్వాత ఈయన చేసిన సాహో సినిమా హిందీలో కూడా 150 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ రేంజ్ చూపించింది. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అయింది. దాంతో ప్రభాస్ కు ధైర్యం వచ్చింది. 

ప్ర‌భాస్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు కూడా మరింత నమ్మకం పెరిగింది. అందుకే ఇప్పుడు అత‌డు చేస్తున్న సినిమాల బడ్జెట్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి. ఒక్కో సినిమాకు వందల కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ప్రభాస్ కమిటైన రాబోయే 4 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు దాటిపోయిందంటే ఈయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ బడ్జెట్ దాదాపు 140 కోట్లు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత సలార్ బడ్జెట్ కూడా 140 కోట్లకు పైగానే ఉండబోతుంది. కేజియఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియన్ స్థాయిలో 150 కోట్లకు తగ్గకుండా ఈ సినిమా రానుంది. 

మరోవైపు ఆదిపురుష్ పౌరాణిక చిత్రం. అందులో రాముడిగా నటించబోతున్నాడు ప్రభాస్. ఈ చిత్రం కోసం 300 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా కోసం 400 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుందని.. అందుకే అంత బడ్జెట్ అయినా ధైర్యం చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఈ నిర్మాత. అలా మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న రాబోయే 4 సినిమాల బడ్జెట్ దాదాపు 1000 కోట్లు ఉండబోతుంది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం కమిటైన నాలుగు సినిమాలు పూర్తైన తర్వాత ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తున్నాడు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా..సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు ప్రభాస్. పైగా పాన్ ఇండియన్ సినిమాల కోసం మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు. అందుకే ఈ బ్రేక్ కావాలంటున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా తర్వాత ఈ బ్రేక్ తీసుకోనున్నాడు యంగ్ రెబల్ స్టార్.

ఇవి కూడా చ‌ద‌వండి

క‌మెడీయ‌న్స్ గ్రూప్ ఫొటో.. వైర‌ల్‌గా మారిన పిక్

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo