మంగళవారం 07 జూలై 2020
Cinema - Mar 29, 2020 , 21:44:47

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

‘అమరం అఖిలం ప్రేమ’ చిత్ర నిర్మాత వి.ఇ.వి.కె.డి.ఎస్‌ ప్రసాద్‌ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 1967లో కాకినాడలో జన్మించారు. ప్రసాద్‌కు భార్య పద్మజతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు అత్యంత సన్నిహితుల్లో ప్రసాద్‌ ఒకరు. స్నేహితుడి మరణం తనను ఆవేదనకు లోనుచేసిందని సుకుమార్‌ అన్నారు. ‘ప్రసాద్‌ నాలో ఎప్పుడూ ఎనర్జీని నింపుతుండేవారు. నాకు సంబంధించినంతవరకు అతడి స్థానాన్ని ఎవరూ రీప్లేస్‌ చేయలేరు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతిని  తెలియజేస్తున్నాను’ అని సుకుమార్‌ తెలిపారు. logo