మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 00:09:32

థియేటర్లను తెరవాలి

థియేటర్లను తెరవాలి

థియేటర్ల మూసివేత సాకు తో ఓటీటీ ద్వారా పెద్ద సినిమాల్ని విడుదల చేయడం సరికాదని అన్నారు నిర్మాత నట్టికుమార్‌. ఓటీటీ ద్వారా  ఇలాగే సినిమాలు విడుదల చేస్తే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నట్టికుమార్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘అన్‌లాక్‌ పేరుతో రైళ్లు, విమానాలు, మాల్స్‌ను తెరిచేందుకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం థియేటర్లుకు పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది  కార్మికుల నష్టపోతున్నారు. లీజులు, లాబీయింగ్‌లకు భయపడే థియేటర్లను తెరవడం లేదు. విమానాలు,  రైళ్లలో లేని సీటీంగ్‌ కెపాసిటీ నియమాలు థియేటర్లలో మాత్రం ఉండాలనే షరతు విధిస్తున్నారు. ఈ రూల్స్‌ వల్ల థియేటర్ల యజమానులు ఎంతో నష్టపోతారు. ప్రస్తుతం నా నిర్మాణ సంస్థపై రామ్‌గోపాల్‌వర్మతో కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే స్వీయ దర్శకత్వంలో  ‘సైకో వర్మ’, ‘దెయ్యంతో సహవానం’ అనే సినిమాలు చేయబోతున్నాను. ‘దిశ ఎన్‌కౌంటర్‌' సినిమా ముగింపు దశకు వచ్చింది. మరో ఆరు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి’ అనితెలిపారు. logo