ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 19:56:44

ప్లాస్మా దానానికి రెడీ అంటోన్న నిర్మాత

ప్లాస్మా దానానికి రెడీ అంటోన్న నిర్మాత

ఇటీవల టాలీవుడ్‌లో కూడా కరోనా కలకలం కొనసాగుతుంది. ఆ కోవలోనే ప్రముఖ నిర్మాత, కమెడియన్‌ బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయిన గణేష్‌ తాను ప్లాస్మా ఇవ్వడానికి రెడీగా వున్నానని తెలియజేశారు. కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్‌ రోగికి ఇవ్వడంతో అతను త్వరగా కోలుకునే అవకాశముందనే విషయం అందరికి తెలిసిందే.

ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించి ప్రస్తావించగా బండ్ల గణేష్‌ స్పందిస్తూ..ప్లాస్మా ఇవ్వడం తన డ్యూటి అని తప్పకుండా ఇస్తానన్నారు. తాను త్వరగా కోలుకోవడానికి కారణమైన డాక్టర్లకు, తన శ్రేయాభిలాషులకు, దేవుడికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 


logo