శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 12, 2020 , 11:26:38

ప్రియాంక ఒక్క పోస్ట్ విలువ తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

ప్రియాంక ఒక్క పోస్ట్ విలువ తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. పెళ్ళికి ముందు సినిమాలు, ప‌ర్స‌న‌ల్ టూర్ విష‌యాల‌ని షేర్ చేసిన ప్రియాంక..నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత ఇద్ద‌రికి సంబంధించిన విష‌యాల‌ని త‌ర‌చుగా షేర్ చేస్తూ ఉంది. ఇటీవ‌ల హోలీ వేడుక‌క‌లో పాల్గొన్న ఫోటోల‌ని షేర్ చేసి ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగించింది. ప్ర‌స్తుతం ఆమెని ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియ‌న్స్ మంది అనుస‌రిస్తున్నారంటే ప్రియాంక‌కి ఉన్న ఫాలోయింగ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ప్రియాంక చోప్రా పోస్ట్ విలువ ఆమె పాపులారిటీకి త‌గ్గ‌ట్టే ఉంటుంద‌ట‌. తాజాగా హోపర్‌ హెచ్‌క్యూ సంస్థ సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించింది. ప్రియాంక ఓ బ్రాండ్‌ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌మోట్ చేస్తే అక్ష‌రాలా రూ. 2 కోట్లు తీసుకుంటుంద‌ని వెల్ల‌డించింది. ఈ మొత్తం కొంద‌రు హీరోలు సినిమా రెమ్యున‌రేష‌న్‌గా అందుకుంటున్న విష‌యం తెలిసిందే. ఏదేమైన త‌న‌కి వ‌చ్చిన పాపులారిటీని ప్రియాంక చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు.  ఇటీవ‌ల‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’  అనే హిందీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్రియాంక ప్రస్తుతం ‘వి కెన్‌ బి హీరోస్‌’, ‘ది మాట్రిక్స్‌ 4’, ‘ది వైట్‌ టైగర్‌’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ‘ది వైట్‌ టైగర్‌’‌ను నెట్‌ప్లెక్స్ సంస్ధ నిర్మిస్తోంది. మ‌రోవైపు ప‌ర్పుల్ పెబుల్ పిక్చ‌ర్స్ అనే నిర్మాణ సంస్థ‌ని నిర్మించి సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. 


logo