నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత యూనివర్సల్ సెలబ్రిటీ అయిపోయింది బాలీవుడ్ (Bollywood) భామ ప్రియాంకాచోప్రా (Priyanka Chopra). ఈ బ్యూటీ సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటూ తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలతోపాటు ఇతర అప్డేట్స్ ను అందరితో పంచుకుంటుంది. తాజాగా ప్రియాంకా చోప్రా స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
తన వెకేషన్ డైరీస్ నుంచి స్పెయిన్ వీధుల్లో (Spain streets) నిలబడి ఆలోచనలు చేస్తున్న ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. హాలీడే మూడ్‌లో ఉన్న ప్రియాంకా లైట్ బ్లూ షార్ట్ డ్రెస్‌లో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఓ గోడ పక్కనే పోల్‌పై వాలి సమాలోచన చేస్తోంది. ఈ ఫొటోను ఫాలోవర్లు, అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ముందుకు సాగకపోతే..మీరు వెనక్కి తగ్గుతారు..అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ప్రియాంకా చోప్రా నటించిన The Matrix Resurrections, Text for You చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. మరోవైపు అమెరికన్ టీవీ సిరీస్ Citadelలో నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్‌ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్