శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 12, 2020 , 10:43:36

రెండు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చిన ప్రియాంక చోప్రా

రెండు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చిన ప్రియాంక చోప్రా

క‌రోనా వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచం మొత్తం స్తంభించింది. మందు లేని కోవిడ్ 19 రోగాన్ని నివారించేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ని విధించాయి. దీంతో సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లోని త‌న ఇంటికి ప‌రిమిత‌మైంది. అయితే తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెండు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట అడుగుపెట్టాన‌ని చెప్పుకొచ్చింది ప్రియాంక‌

క‌రోనా వైర‌స్ వ‌ల‌న యూఎస్‌లో 80వేల‌కి పైగా క‌న్నుమూసారు. ఇక ఇప్పుడిప్పుడే ఆ దేశం క్ర‌మంగా కోలుకుంటుంది. ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ముఖానికి మాస్క్‌తో బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ.. కళ్ళు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు.. 2 నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చాను. మాస్క్‌కి ధ‌న్య‌వాదాలు అంటూ కామెంట్ పెట్టింది. 


logo