బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న తర్వాత అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ బిజీగా మారింది. అయితే తన భర్తతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న ప్రియాంక ఇప్పుడు లండన్ళో ఉంది. సిటాడెల్ షూటింగ్లో భాగంగా కొద్ది రోజుల క్రితం అక్కడికి వెళ్లింది.
ప్రియాంక ఈ రోజు 39వ వసంతంలోకి అడుగుపెట్టగా, తన బర్త్‌డేని కజిన్స్ దివ్య జ్యోతి, జేమ్స్ కవనాగ్లతో కలిసి జరుపుకున్నారు. అలాగనే తన బర్త్‌డే సందర్భంగా ప్రియాంక బ్లాక్ కలర్ బికినీలో దిగిన బ్యూటీ ఫుల్ పిక్ షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్స్ ఆమెను మత్స్యకన్యగా వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక సినిమాలే కాక బిజినెస్ కూడా చేస్తుంది. ఇప్పటికే సోనా అనే రెస్టారెంట్‌ని ప్రారంభించగా, కొద్ది రోజుల క్రితం తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌ని సందర్శించింది.