అతిలోక సుందరి శ్రీదేవి తెలియని వారు కాని లేదంటే ఆమె అంటే నచ్చని వారు ఉండడం చాలా అరుదు. బహుబాషా నటిగా అశేష ప్రేక్షకాదరణ పొందిన శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మరణం అందరికి ఓ పీడకలగా మారింది. శ్రీదేవి భౌతికంగా మనకు దూరమైన ఆమె సినిమాల ద్వారా ఇంకా మన మధ్య కదలాడుతూనే ఉంది. అయితే శ్రీదేవిని ప్రేమించే వాళ్లలో తాను ఒకరిని అంటూ ప్రియాంక చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
హాలీవుడ్ మ్యాగజైన్‌తో మాట్లాడిన ప్రియాంక చోప్రా.. శ్రీదేవి గురించి చెబుతూ.. శ్రీదేవి కెరీర్ చూస్తూ నెను పెరిగాను. ఆమె బ్యూటీ ఐకాన్. ప్యాషన్ పరంగా ప్రయోగాలు ఎక్కువగా చేసేవారు. కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించేవారు. శ్రీదేవి కళ్లు చాలా బాగుంటాయి. నటన, హావ భావాలు అమోఘం. కెరీర్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అందుకే ఆమె నాకు స్పూర్తి అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.