సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 14:55:30

ప్రియాంక 'ది వైట్ టైగ‌ర్' ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్రియాంక 'ది వైట్ టైగ‌ర్' ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ది వైట్ టైగ‌ర్.చిత్రంలో ఆద‌ర్శ్ గౌర‌వ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జ‌న‌వ‌రి 22న నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కొన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి బుధ‌వారం ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ లోని సన్నివేశాలు  ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి.

చిత్రంలో ప్రియాంక మరియు రాజ్ కుమార్ లు..  వ్యాపారం కోసం యుఎస్ నుండి భారతదేశానికి వెళ్ళిన తరువాత వారి జీవితాలు మారిన జంట పాత్రలో నటించారు. వీరిద్ద‌రి పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు ఎంతో థ్రిల్‌ని క‌లిగిస్తున్నాయి. ఈ చిత్రం  2008లో మ్యాన్ బ్రోక‌ర్ ప్రైజ అందుకున్న న‌వ‌ల అర‌వింద్ అడిగా ఆధారంగా రూపొందింది. చిత్రంలో ఆద‌ర్శ్ గౌర‌వ్ ఇండియాకు చెందిన పేద డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తుంది. మీరు ట్రైల‌ర్ చూసి ఎంజాయ్ చేయండి.