శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 11:33:15

ప్రియాంక ‘అన్‌ఫినిష్డ్‌’పై తాజా అప్‌డేట్

ప్రియాంక ‘అన్‌ఫినిష్డ్‌’పై తాజా అప్‌డేట్

గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఉంటుంది. త‌న జీవితంలో ఎన్నో ఆటు పోట్ల‌ని అధిగ‌మించి ఉన్న‌త స్థాయికి చేరిన ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫీని ‘అన్‌ఫినిష్డ్‌’ అనే పుస్తకం ద్వారా మ‌న ముందుకు తీసుకురాబోతుంది. ఈ పుస్త‌కం పూర్త‌యింద‌ని, జ‌న‌వ‌రి 19న మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌నున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. 

పుస్త‌కం క‌వ‌ర్ పేజీని కూడా ప్రియాంక త‌న ట్విట్ట‌ర్ పేజ్‌లో షేర్ చేసింది. అమెజాన్‌లో ఈ పుస్త‌కం ఫ్రీ బుకింగ్ ద్వారా కొనుగోలు చేయోచ్చు.  పుస్తకంలో ప్రియాంక తన బాల్యం, నటిగా తన ప్రయాణం, హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ చర్చించింద‌ట‌. ఈ పుస్త‌కంతో త‌న‌తో పాటు మ‌నంద‌రం ప్రయాణించే అవ‌కాశం ఉంద‌ని ఆశిస్తుంది ప్రియాంక చోప్రా.