మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 14:47:18

సోనూసూద్‌ను ప్ర‌శంసించిన ప్రియాంక చోప్రా

సోనూసూద్‌ను ప్ర‌శంసించిన  ప్రియాంక చోప్రా

లాక్‌డౌన్ స‌మ‌యంలో అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేసి అంద‌రి హృద‌యాల్లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు సోనూసూద్. ఆయ‌న సేవ‌ల‌కు గాను   ప్రపంచ ప్రసిద్ధి ఐక్యరాజ్యసమితి చేత గొప్ప మానవతావాదిగా  సత్కారం పొందాడు. ఇలాంటి అవార్డును ఇప్పటివరకు అతి కొద్ది మంది హాలీవుడ్ స్టార్స్ మాత్రమే పొందారు. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో, ఏంజెలినా జోలీ లాంటి నటుల తర్వాత మన దేశం నుంచి సోనూ సూద్ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. 

సోనూ సూద్ కంటే ముందు గ్లోబ‌ల్ నటి ప్రియాంకా చోప్రా కూడా ఈ అవార్డును అందుకున్నారు. అయితే సోనూసూద్‌కు ద‌క్కిన గౌర‌వంపై ప్రియాంక చోప్రా త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. ఈ అవార్డుకు మీరు అర్హులే. గొప్ప సేవ‌ల‌ను మీరు ఇలాగే కొన‌సాగిస్తార‌ని ఆశిస్తున్నాను. మీరు చేసిన సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అని ప్రియాంక త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ప్రియాంక విషెస్‌కు వెంట‌నే స్పందించిన సోనూ సూద్.. మీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు ప్రియాంక . మీరు లక్షలాది మందికి ప్రేరణ కాగా, అందులో నేను ఒకడిని. మీరు మా నిజమైన హీరో. ప్రపంచాన్ని మార్చే స‌త్తా మీకుంది అంటే ప్రియాంక‌పై త‌న‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త ప‌రిచాడు సోనూ.


logo