మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 02:11:44

మ్యాట్రిక్స్‌-4లో ప్రియాంక

మ్యాట్రిక్స్‌-4లో ప్రియాంక

సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కథాంశాలతో తెరకెక్కిన ‘మ్యాట్రిక్స్‌' సిరీస్‌ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్ని మెప్పించాయి. ఈ ఫ్రాంచైజ్‌లో నాలుగో భాగం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా నటించనున్నట్లు తెలిసింది. యాక్షన్‌ హంగులతో  ఆమె పాత్ర ఛాలెంజింగ్‌గా సాగుతుందని చెబుతున్నారు.   నాయకానాయికలు కీనూ రీవ్స్‌, అన్నేమోస్‌లతో సమానంగా  ప్రియాంకచోప్రా పాత్ర కథలో కీలకంగా     ఉంటుందని సమాచారం.  లానా వచోవ్‌స్కీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా వైరస్‌ ఉధృతి దృష్ట్యా సరైనా భద్రతా ప్రమాణాలతో త్వరలోనే ఈ సినిమాను షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.  2022 ఏప్రిల్‌ 1న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.


logo