బుధవారం 03 జూన్ 2020
Cinema - May 01, 2020 , 17:13:13

చిన్నారులకు అండ‌గా ప్రియాంక చోప్రా ‌

చిన్నారులకు అండ‌గా ప్రియాంక చోప్రా ‌

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా సినిమాల‌తో పాటు సామాజిక సేవ‌లో త‌న‌వంతు పాత్ర పోషిస్తుంది. ప్ర‌స్తుతం కరోనా బారిన ప‌డి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. క‌రోనా ధాటికి ఇబ్బంది ప‌డుతున్న చిన్నారులను కాపాడేందుకు ముందుకొచ్చింది ప్రియాంక‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిన్నారులపై క‌రోనా ప్ర‌భావం ఉండ‌టం హృద‌య‌విదార‌క‌మైన అంశం.

బాలబాలిక‌లు ఆహార కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. క్షీణించ‌బ‌డిన ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌తో కుదేల‌వుతున్నారు. ఓ వైపు హింస‌, మ‌రో వైపు విద్య‌కు దూర‌మ‌వ‌డం ఇలా చాలా ర‌కాల స‌మ‌స్య‌లు వారిని చుట్టుముట్టాయి. చిన్నారుల‌ను కాపాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది..అని ప్రియాంక ట్వీట్ చేసింది. 

ఈ మేర‌కు ప్రియాంక జోనాస్ స్వీడిష్ సామాజిక కార్య‌క‌ర్త గ్రెటా థ‌న్‌బెర్గ్‌, యూనిసెఫ్ చేప‌డుతున్న క్యాంపెయిన్ తో చేతులు క‌లిపింది. ఇప్ప‌టికే ప్రియాంక‌-నిక్ దంప‌తులు యూనిసెఫ్ తోపాటు, పీఎం కేర్స్ ఫండ్స్ కు త‌మ వంతు ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు.  ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo