మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 10:41:01

టీఐఎఫ్ఎఫ్ అంబాసిడ‌ర్‌గా ప్రియాంక‌.. గ‌ర్వంగా ఉంద‌న్న పీసీ

టీఐఎఫ్ఎఫ్ అంబాసిడ‌ర్‌గా ప్రియాంక‌.. గ‌ర్వంగా ఉంద‌న్న పీసీ

ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రిగే టొరొంటో చలన చిత్రోత్సవాలు ఈ సారి కూడా  సెప్టెంబర్‌ 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. అయితే క‌రోనా వ‌ల‌న ఈ సారి  వేడుకలు డిజిటల్‌లో స్క్రీనింగ్‌ అవుతాయి. ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకోగా, భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. 

తాజాగా ప్రియాంక చోప్రా త‌న‌కి ద‌క్కిన ఈ గౌర‌వానికి సంతోషిస్తూ గ‌తం జ్ఞాప‌కాల‌కి సంబంధించిన క్లిప్‌ల‌ని జ‌త చేసి వీడియో రూపంలో షేర్ చేసింది.  టీఐఎఫ్ఎఫ్ నాకు రెండో ఇల్లు లాంటింది. న‌టిగా, నిర్మాత‌గా నేను ఈ వేడుక‌లో అనేక సార్లు పాల్గొన్నాను. టీఐఎఫ్ఎఫ్ ఎల్లప్పుడు  గ్లోబల్ కంటెంట్‌కు మద్దతు ఇస్తూ వారిని విజేతగా నిలిపేందుకు ముందంజలో ఉంటుంది. సినీ వేడుక‌ల‌లో టీఐఎఫ్ఎఫ్‌కి ప్ర‌త్యేక స్థానం ఉండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అభిమానులు నాపై ఎప్పుడు ప్రేమ‌ని కురిపిస్తుంటారు. ఈ సంవ‌త్స‌రం అంబాసిడ‌ర్‌గా ఎంపికైనందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఈ  రిలేష‌న్‌ని ఎప్ప‌టికీ కొన‌సాగించాల‌ని భావిస్తున్నాను అని ప్రియాంక పేర్కొంది.logo