ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 13:12:40

ప్రియాంక ఇన్ స్టా పోస్టుకు కాసుల వర్షం

ప్రియాంక ఇన్ స్టా పోస్టుకు కాసుల వర్షం

సాధారణంగా నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ లో రకరకాల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినీ తారలకైతే ఇన్ స్టా పోస్టులతో ఫాలోవర్లు లక్షల సంఖ్యలో పెరిగిపోతుంటారు. దీంతో సదరు సెలబ్రిటీ ఇన్ స్టాగ్రామ్ పేజీకి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇన్ స్టా లో అప్ లోడ్ చేసే సింగిల్ పోస్ట్..కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతుందంటే నమ్ముతారా..? అవును ఇది నిజం.బాలీవుడ్ తార ప్రియాంక చోప్రాను  ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లున్న ప్రియాంక చోప్రా ఓ పోస్ట్ కు రూ.2.16 కోట్లు సంపాదిస్తోందట. ప్రపంచవ్యాప్తంగా ప్రియాంక  56 మిలియన్ల మంది ఫాలోవర్లతో..ఆన్ లైన్ బిజినెస్ ప్రమోటింగ్ లో భాగంగా డబ్బు సంపాదిస్తున్న తారల్లో ఇండియాలో టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. వరల్డ్ వైడ్ గా ఇన్ స్టాగ్రామ్ లో అత్యధికంగా ఆర్జిస్తున్న తారల్లో ప్రియాంక 28వ స్థానంలో ఉంది.

ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు డాన్ జాన్సన్ ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు మార్కెట్ లో రూ.7.6 కోట్లతో టాప్ 1 స్థానంలో నిలిచాడు.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo