గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల తన ఆత్మకథని అన్ ఫినిష్డ్
బుక్ ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇందులో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు రాయగా, కొన్ని సంఘటనలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా పదో తరగతి సమయంలో తన బాయ్ ఫ్రెండ్‌తో చేసిన చిలిపి సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
పదో తరగతిలో ప్రియాంక ఒక అబ్బాయికి ఫ్లాట్ కాగా, అతనితో చాలానే చేసింది. బాబ్ అని పేరు మార్చి అతడి గురించి చెప్పుకొచ్చిన ప్రియాంక .. పదో తరగతిలో బాబ్ ని కలుసుకున్నానని తెలిపింది. అతను తన ఫన్నీ చేష్టలతో అత్యంత శృంగార హావభావాలతో నా మనసు గెలుచుకున్నాడని పేర్కొంది. అతనిని వివాహం కూడా చేసుకోవాలని ఈ అమ్మడు భావించిందట.
ఒక రోజు ప్రియాంక తన ఇంట్లో బాబ్‌తో కూర్చొని టీవీ చూస్తుందట. అదే సమయంలో తన అత్త వస్తుండడం గమనించిన ప్రియాంక అతనిని దాచేందుకు నానా కష్టాలు పడింది. అయితే ప్రియాంక రూంలో ఎవరో ఉన్నారని గమనించిన ఆమె అత్త దగ్గకరకు వచ్చి తెరువ్
అని గట్టిగాఅడిగింది. ఏమి తెరవాలి? అని అడిగాను. నీ గదిని తెరువు
అని నా అత్త కోపంగా అడిగింది.
అత్తని అంత కోపంతో ఎప్పుడు చూడలేదు. నేను గది తలుపు తెరవగానే ఒక అబ్బాయి బయటకు వచ్చాడు. అయితే ఈ విషయాన్నిఅత్త మా అమ్మకు చెప్పి అడ్డంగా బుక్ చేసింది. ఇలా 10వ తరగతి బోయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ మ్యాటర్ ని తన ఆత్మకథ బుక్ ద్వారా రివీల్ చేసింది ప్రియాంక.