మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jun 26, 2020 , 09:37:22

టీఐఎఫ్ఎఫ్ అంబాసిడ‌ర్‌లుగా ప్రియాంక‌, అనురాగ్

టీఐఎఫ్ఎఫ్ అంబాసిడ‌ర్‌లుగా ప్రియాంక‌, అనురాగ్

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ఆస్కార్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక‌లు వాయిదా ప‌డ్డాయి. కాని  టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్‌లో స్క్రీనింగ్‌ అవుతాయి. టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చరిత్రలో డిజిటల్‌లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే.

45వ టొరొంటో చలన చిత్రోత్సవాలలో ప‌లువురు స్టార్స్ రెడ్ కార్పెట్‌పై చేసే సంద‌డి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈ సారి ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. గ‌తంలో ప్రియాంక న‌టించిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన నేప‌థ్యంలో ప్రియాంక రెడ్ కార్పెట్‌పై  క్యాట్‌ వాక్‌’ చేసి క‌నువిందు చేశారు.


logo