శనివారం 29 ఫిబ్రవరి 2020
వాలంటైన్స్‌డే రోజున నిక్యాంక హంగామా- వీడియో

వాలంటైన్స్‌డే రోజున నిక్యాంక హంగామా- వీడియో

Feb 15, 2020 , 12:14:05
PRINT
వాలంటైన్స్‌డే రోజున నిక్యాంక హంగామా- వీడియో

క్రేజీ క‌పుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు వాలంటైన్స్ డేని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 14 రోజున నిక్ జోనాస్ త‌న ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి మిలాన్ కాన్స‌ర్ట్ నిర్వ‌హించారు. ఈ కాన్స‌ర్ట్‌కి ముందు నిక్ జోనాస్‌, ప్రియాంక చోప్రాలు 2018లో ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన సింబా చిత్రంలోని ఆంఖ్ మేరే సాంగ్‌కి త‌మ‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేశారు. ఈ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని నిక్ జోనాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... నా వాలంటైన్‌తో ప్రీ షో డ్యాన్స్ పార్టీ అనే కామెంట్ పెట్టాడు. ప్రియాంక‌తో నిక్ వేసిన స్టెప్పులు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రోవైపు అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్ త‌న ఇద్ద‌రు సోద‌రులు కెవిన్ జోనాస్‌, జో జోనాస్‌లు క‌లిసి మిలాన్‌లో జ‌రిపిన కాన్స‌ర్ట్‌కి భారీగా క్రౌడ్ వచ్చార‌ని వీడియో ద్వారా తెలియ‌జేశాడు. logo