మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 00:17:36

మహాసముద్రంలో..

మహాసముద్రంలో..

తొలి చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌'తో యువతరాన్ని ఆకట్టుకుంది మలయాళీ సోయగం ప్రియాంక అరుళ్‌మోహన్‌. చూడచక్కనైన రూపంతో పాటు చక్కటి అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సుందరి శర్వానంద్‌ సరసన ‘శ్రీకారం’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక మరోమారు శర్వానంద్‌తో జోడీకట్టబోతున్నదని తెలిసింది. వివరాల్లోకి వెళితే..‘ఆర్‌.ఎక్స్‌.100’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్‌భూపతి. ఆయన నిర్ధేశకత్వంలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. సీనియర్‌ హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. కథానుగుణంగా నాయిక పాత్ర కీలకంగా ఉంటుందని తెలిసింది. తొలుత కథానాయిక పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, అదితీరావు హైదరీ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్‌మోహన్‌ను ఖరారు చేశారని సమాచారం. కథలోని ఎమోషన్‌..తన పాత్ర చిత్రణ నచ్చడంతో ఆమె ఈ సినిమాకు అంగీకరించిందని చెబుతున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభంకానుంది.
logo