సోమవారం 01 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 19:01:59

న‌క్స‌లైట్ పాత్ర‌లో ప్రియ‌మ‌ణి..!

న‌క్స‌లైట్ పాత్ర‌లో ప్రియ‌మ‌ణి..!

రానా, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో విరాట‌ప‌ర్వం 1992 తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అందాల న‌టి ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం విరాట‌ప‌ర్వంలో ప్రియ‌మ‌ణి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

సినీ మీడియాతో చేసిన చిట్ చాట్ లో ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ..అవును విరాట‌ప‌ర్వంలో  నేను న‌క్స‌లైట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్ లో స‌రికొత్త చిత్రం కానుంది. వాస్త‌వాంశాల ఆధారంగా తెర‌కెక్కుతుందని చెప్పింది. ఇదిలా ఉంటే మ‌రోవైపు ప్రియ‌మ‌ణి వెంక‌టేశ్ నటిస్తోన్ననార‌ప్ప చిత్రంలో కూడా ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త‌మిళంలో హిట్టుగా నిలిచిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo