శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 04:03:41

కొటేషన్‌ గ్యాంగ్‌ లీడర్‌

కొటేషన్‌ గ్యాంగ్‌ లీడర్‌

ప్రియమణి నాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌'. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరెకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గాయత్రి సురేష్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో ధన్యా రాఫియా బాను, వైష్ణో వారియర్‌, అక్షయ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, ఓ స్టార్‌హీరో కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడని, ముంబై, తమిళనాడు, తెలుగురాష్ర్టాల్లో చిత్రీకరణ జరుగుతుందని, మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది.