గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 11:19:13

క‌రోనా నుండి త‌ప్పించుకొని జార్జియా చేరుకున్నాను

క‌రోనా నుండి త‌ప్పించుకొని జార్జియా చేరుకున్నాను

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి ఓ డియ‌ర్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అయితే చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు  ప్ర‌భాస్‌, పూజా హెగ్డే  కొద్ది రోజుల క్రితం జార్జియా చేరుకున్నారు. తాజాగా పెళ్లి చూపులు ఫేం ప్రియ‌ద‌ర్శి కూడా జార్జియాలో అడుగుపెట్టాడు. 

క‌రోనా కార‌ణంగా విదేశాల‌కి వెళ్ళాలంటే భ‌య‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఓ డియ‌ర్ టీం ధైర్యం చేసి జార్జియా వెళ్లింది. తాను కూడా క‌రోనా నుండి త‌ప్పించుకొని మూడు ఫ్లైట్ల ద్వారా జార్జియా చేరుకున్న‌ట్టు ప్రియ‌ద‌ర్శి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. జార్జియాలో మార్చి 13 వ‌ర‌కు 42 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అక్కడి ప్ర‌భుత్వం ఎమర్జెన్సీ కూడా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ 20వ చిత్ర బృందం అక్క‌డ షూటింగ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు సేఫ్ అన్న‌ది స‌గటు ప్రేక్ష‌కుడి ప్ర‌శ్న‌గా మారింది.  


logo