సోమవారం వస్తే బిగ్ బాస్ హౌజ్ రణరంగంగా మారడం ఖాయం. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ .. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి పేర్లు టైల్స్‌పై రాసి, ఆ టైల్స్‌ని సుత్తితో బద్దలు కొట్టాలని సూచించారు. ఇక నామినేషన్ ప్రక్రియ షురూ కాగా, ఎప్పటిలానే శ్రీరామ్… మానస్‌ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రవిని నామినేట్ చేశాడు.
రవి.. జెస్సీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. జెస్సీకి తగిలింది చిన్న దెబ్బే అయినా కూడా దానిని పెద్దదిగా చూపించుకునే ప్రయత్నంచేస్తున్నాడు. అతను ఈ ప్లాట్‌ఫామ్‌ని వేస్ట్ చేసుకుంటున్నాడేమోఅని అనిపిస్తుందని జెస్సీని నామినేట్ చేశాడు. అయితే రవి కామెంట్స్‌కి జెస్సీ సీరియస్‌గానే రియాక్ట్ ఆయాడు.టాస్క్లోఎలా ఆడానో అందరికి తెలుసు. కుళ్లు జోకులు వేసుకుంటుంటే మధ్యలోదూరలేదు కదా అని అన్నాడు.
లహరి.. ప్రియని నామినేట్ చేస్తూ… మీరు మనసులో ఏదో పెట్టుకొని నాతో దూరంగా ఉంటున్నారని చెప్పింది. దీనికి స్పందించిన ప్రియ.. నువ్ ఎప్పుడూ హౌస్‌లో ఉన్న మగాళ్లతో బిజీగా ఉంటావ్.. కేవలం నువ్ మగాళ్లతోనే కలుస్తున్నావ్ అని అన్నది.. దీనికి పేర్లు చెప్పండి అనగా.. రవి, మానస్‌ల పేర్లు చెప్పేసింది. నీకు మగాళ్లతో ప్రాబ్లమ్స్ ఉండదు. అందుకే వారిని ఎప్పుడు నామినేట్ చేయవు అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది ప్రియ.
ప్రియా కామెంట్స్‌కి లహరికి కూడా చిర్రెత్తుకు రాగా, మీరు పదే పదే.. మగాళ్లతో ఉంటున్నా అని గుద్ది గుద్ది చెప్పడం చాలా తప్పు.. మాట్లాడుతుంటే మెన్ మెన్ అంటున్నావ్.. అమ్మాయిలతో మాట్లాడడం లేదా అని అడిగింది. దీనికి స్పందించిన ప్రియ.. నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకున్నావ్. అది ఫ్రెండ్లీ హగ్ అయిన ఉండొచ్చు అని కామెంట్స్ చేసింది ప్రియ. ఈ మాటలకు లహరి షాక్ అయింది.