కన్నుగీటి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్
(Priya Prakash Varrier) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒరు ఆదార్ లవ్ చిత్రంలో కేవలం ఒక్క కన్నుగీటిన సీన్ తో ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ అయిపోయిందీ మలయాళ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది అప్పుడపుడు అందమైన స్టిల్స్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రియా వారియర్ కు ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నదంటే ఈ భామకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ప్రియా వారియర్ స్పాగెట్టీ రెడ్ టాప్ (Spaghetti Red Top) అండ్ బ్లాక్ స్కర్ట్‌లో క్యూట్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. అసనియా నజ్రిన్, సుసాన్ లారెన్స్ డిజైన్ చేసిన డ్రెస్ లో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఆకట్టుకునే అందమైన కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. కొంతకాలంగా తెలుగు సినిమాలపై ఫోకస్ పెడుతోంది ప్రియావారియర్.
ఈ ఏడాది టాలీవుడ్ యాక్టర్ నితిన్ తో కలిసి చెక్ సినిమాలో మెరిసింది ప్రియా వారియర్. అయితే ఈ చిత్రం ఆశించిన సక్సెస్ ను అందించలేకపోయింది. తేజ సజ్జతో కలిసి నటించిన ఇష్క్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు కన్నడ చిత్రం విష్ణు ప్రియ లో నటిస్తోంది ప్రియావారియర్.
ఇవి కూడా చదవండి..
Samantha Gym Video | సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?