బుధవారం 03 జూన్ 2020
Cinema - May 19, 2020 , 22:45:38

సోషల్ ‌మీడియా డిస్టాన్సింగ్స్‌

సోషల్ ‌మీడియా డిస్టాన్సింగ్స్‌

ఒక్క కన్నుగీటుతో యువతరం హృదయాల్లో కల్లోలం రేపింది  మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. వింక్‌గర్ల్‌గా ఓవర్‌నైట్‌లో తిరుగులేని ప్రాచుర్యం సంపాదించుకుంది. ఒక్కరోజులోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరులక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఇండియన్‌ సెలబ్రిటీగా ఈ సొగసరి పేరు మీద రికార్డు కూడా ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌మీడియా డిస్టాన్సింగ్స్‌ పాటించాలని నిర్ణయించుకుందట. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి వైదొలగుతున్నట్లు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రకటించింది. అయితే అందుకుగల కారణమేమిటో మాత్రం వెల్లడించలేదు. ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7మిలియన్లకుపైగా అనుచరగణం ఉంది. రెగ్యులర్‌ అప్‌డేట్స్‌తో ఇన్‌స్టాలో చురుగ్గా ఉండే ఆమె ఒక్కసారిగా ఖాతాను డీయాక్టివ్‌ చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలకాలంలో ఆమె పెట్టిన పోస్టులపై కొందరు అభ్యంతరకరమైన కామెంట్స్‌ చేశారని, ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఈ సుందరి తాత్కాలికంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.


logo