కరోనా వలన సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు కాస్త ఉపశమనం కోసం నెటిజన్స్తో ముచ్చటిస్తూ ఉన్నారు.ఈ క్రమంలోవారికి అభిమానుల నుండి విచిత్ర ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. వాటికి తమదైన శైలిలో బదులిస్తూ వార్తలలో నిలుస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా తమిళ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పై మనసుతో సహా అన్నీ పారేసుకున్న అభిమాని.. ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తంచేశాడు.
ప్రియా భవానీ రీసెంట్గా క్వశ్చన్ అవర్ నిర్వహించగా, ఆమెను ఓ అభిమాని ”మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి” అని అడిగాడు. దీనికి ప్రియా ఏమని రిప్లే ఇచ్చిందంటే.. ”నాతో ప్రయాణం కొత్తవారికి కష్టమే. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడం ఎలా అన్నది తెలియకపోవడమే మీకు మంచిది. సురక్షితం కూడా” అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తో ‘అహం బ్రహ్మస్మీ’ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం.