శనివారం 11 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 11:00:02

ఎట్ట‌కేల‌కి మ‌ళ్ళీ క‌లిసాం.. : హీరో

ఎట్ట‌కేల‌కి మ‌ళ్ళీ క‌లిసాం.. :  హీరో

మ‌లయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ‘ఆదుజీవితం’ షూటింగ్‌ నిమిత్తం​  జోర్డాన్‌కి వెళ్ళ‌గా, లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు రెండు నెల‌లు అక్క‌డే ఉండిపోయాడు. భారత్‌ చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా  ‘ఆదుజీవితం’ చిత్ర బృందం  మే 22న ప్రత్యేకం విమానంలో భారత్‌ తిరిగొచ్చారు. అనంతరం కేరళకు చేరుకున్న వీరందరిని 14 రోజులుపాటు క్వారంటైన్‌లో ఉంచారు.  రీసెంట్‌గా  పృథ్వీరాజ్‌ కోవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ అని తేలింది.

14 రోజుల క్వారంటైన్ త‌ర్వాత త‌న ఫ్యామిలీని క‌లుసుకున్న పృథ్వీరాజ్ ఆనందంతో సోష‌ల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.  తన భార్య సుప్రియా మీనన్‌, గారాల కూతురు అలంకృతాతో దిగిన ఫ్యామిలీ ఫోటోను   ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ ఎట్టకేల‌కి మళ్లీ ఒకటయ్యాం’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలో అంద‌రి క‌ళ్ళ‌ల్లో ఆనందం క‌నిపిస్తుంది. లాక్‌డౌన్ వ‌ల‌న త‌న భ‌ర్తకి దూరంగా ఉన్న సుప్రియా ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాధ‌‌తో పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే. 


logo