మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 09:28:40

ఈ సారి సుల్తాన్‌గా.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్ అంటున్న కార్తీ

ఈ సారి సుల్తాన్‌గా.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్ అంటున్న కార్తీ

వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో కార్తీ త్వ‌ర‌లో మరో ఇంట్రెస్టింగ్ చిత్రంతో అల‌రించ‌బోతున్నాడు. మూడేళ్ళ క్రితం సుల్తాన్ సినిమా క‌థ విన్న కార్తీ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయాలా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నాడు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమో ఫేమ్  బక్కియరాజ్ కన్నన్ ర‌చ‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌ర్‌గా తెర‌కెక్కుతున్న సుల్తాన్ సినిమాతో ర‌శ్మిక త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నున్నారు. 

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టినందుకు సంతోషం వ్య‌క్తం చేసిన ర‌ష్మిక ..సుల్తాన్ టీంతో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని పేర్కొంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించి అల‌రించ‌గా, త్వ‌ర‌లో పుష్ప ప్రాజెక్ట్‌లో క‌నిపించ‌నుంది. కాగా సుల్తాన్ చిత్రం ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది.