అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాకేష్‌శశి దర్శకుడు. జీఏ2పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై విజయ్.ఎం నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఓ జంట ప్రణయప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వినూత్నమైన కథాంశంతో దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: తన్వీర్ మీర్, సమర్పణ: అల్లు అరవింద్.