ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 18:40:53

హిమాచలి గెటప్ లో ప్రీతిజింటా..ఫొటో వైరల్

హిమాచలి గెటప్ లో ప్రీతిజింటా..ఫొటో వైరల్

ముంబై: ఎంత ఉన్నతస్థానానికి వెళ్లిన వ్యక్తులైనా తాము పుట్టి పెరిగిన వాతావరణం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం మరువలేరు. అవి తమ మనసులో, ఆచరణలో ఎప్పటికీ వెన్నంటి ఉంటాయి. బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకు కూడా ఈ పదాలు సరిగ్గా సరిపోతాయనొచ్చు. 90లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ప్రతీజింటా. వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడింది. ఈ భామ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా.

ప్రీతీ జింటా చాలా రోజుల తర్వాత తనలోని హిమాచలిని బయటకు తీసింది. హిమాచలి సంప్రదాయ టోపీని పెట్టుకుని తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయింది. నాలో హిమాచలిని మననం చేసుకుంటున్నా.. ఎంత దూరం, ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా..మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది మర్చిపోకూడదని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. #himachali, #pahadi అనే హ్యాష్ ట్యాగ్ లను జతచేసింది.  logo